Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్కానింగ్ కోసం దుస్తులు మార్చుకుంటుండగా వీడియో.. వార్డ్ బోయ్ అరెస్ట్

  • ఆసుపత్రిలో వార్డ్ బోయ్ నిర్వాకం
  • దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాల చిత్రీకరణ
  • అరెస్ట్ చేసిన పోలీసులు
పూణెలో దారుణానికి తెగబడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పొత్తి కడుపులో నొప్పి కారణంగా ఓ ఆసుపత్రిలో ఒక మహిళ అడ్మిట్ అయింది. ఎమ్మారై స్కానింగ్ చేయించుకోవాలంటూ డాక్టర్లు ఆమెకు సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆమె ఎమ్మారై స్కానింగ్ కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో, దుస్తులు మార్చుకునే గదిలో కాకుండా మరో గదిలో దుస్తులు మార్చుకోవాలని వార్డ్ బోయ్ ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత ఆ గదిలో ఓ ఫోన్ ఉన్నట్టు ఆమె గమనించి, భర్తకు తెలియజేసింది. ఆ ఫోన్ ను వారు పరిశీలించగా, దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. దీంతో, వీరు కోరేగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వార్డ్ బోయ్ లకేష్ లాహు (25)ని అరెస్ట్ చేశారు.
woman
dress changing
video
pune
hospital

More Telugu News